తెలంగాణలో మావోయిస్టులు లేరు: డీజీపీ
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో DGP శివధర్ రెడ్డి పర్యటించారు. ఆయన కర్రెగుట్టలోని పామూనూరు బేస్ క్యాంప్ సమీపంలో పోలీస్ ఔట్ పోస్టును, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొరుమూరు నుంచి పామూనూరు వరకు దట్టమైన అడవుల్లో రోడ్డు నిర్మాణం చేశామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు లేరని ప్రకటించారు.