జిల్లాలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్

ATP: జిల్లాలో ఓ మహిళ మెడలోని బంగారు నగలు అపహరించిన ఇద్దరు చైన్ స్నాచర్లను సీఐ శాంతీలాల్ అరెస్ట్ చేశారు. జూన్ 21న జరిగిన చోరీపై 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టారు. నల్లమాడ మండలానికి చెందిన నాగార్జున, వరప్రసాద్‌లను పట్టుకున్నారు. రూ.4 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.