నాగార్జునసాగర్ కాలువకు గండి.. స్పందించిన నిమ్మల
AP: నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గండి పడటంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. గండికి కారణాలపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు యుద్ధప్రాతిపదికన అధికారులు గండి పూడ్చుతున్నారు.