బావిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామ శివారులో గల ఒక వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం ఉదయం బావి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో గమనించిన స్థానిక రైతులు లోపలికి వెళ్లి చూడగా, మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.