VIDEO: శిరిడి సాయి పరపతి సంఘం నూతన కమిటీ ఎన్నిక
WGL: వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ శిరిడి సాయి పరపతి సంఘం 30వ సర్వసభ్య సమావేశంలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అచ్చి వెంకటరమణ మెజారిటీతో గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి భానుచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో 95 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతన కమిటీ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపింది.