ఏప్రిల్ 3న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం
MNCL: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3న చెన్నూర్‌లోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం గోడ పోస్టర్లను రూరల్ సీఐ కృష్ణ శనివారం ఆవిష్కరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కోటపల్లి, నీల్వాయి, చెన్నూర్ మండలాల్లో కంటి సమస్యలతో బాధపడే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.