భోజనం నాణ్యతను పరిశీలించిన ఎంపీడీవో
BDK: విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన నాణ్యత, శుభ్రతను MPDO మల్లేశ్వరి, MEO జగన్ పరిశీలించారు. టేకులపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకం అమలును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. వంటగదుల నిర్వహణ, నిల్వ ఉంచిన సరకులను తనిఖీ చేశారు.