ఐటీఐలో 4వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు
PPM; జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి 4వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సాలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ డి. శ్రీనివాస ఆచారి తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ప్రింట్ తీసుకొని, ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలన్నారు.