PM YASASVI ఉపకారవేతన దరఖాస్తుల గడువు పొడిగింపు
ATP: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలిపిన ప్రకారం, PM YASASVI ఉపకారవేతన పథకానికి దరఖాస్తుల గడువు నవంబర్ 15 వరకు పొడిగించబడింది. అర్హత కలిగిన 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.75,000 చొప్పున, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.1.25 లక్షల చొప్పున ఉపకారవేతనం మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.