తాటి ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు తాటి, ఈత మొక్కలను నాటారు. గౌడ సంఘం అధ్యక్షుడు దంతూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గీత కార్మికులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది విరివిగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్సై తిరుపతితో పాటు సిబ్బంది పాల్గొన్నారు