పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్

ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీలో పలు వార్డులలో జరుగుతున్న పారిశుధ్య పనులను బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించినట్లు తెలిపారు. అందులో భాగంగా పట్టణంలో శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.