VIDEO: పలమనేరు హైవేపై వరుస ప్రమాదాలు

VIDEO: పలమనేరు హైవేపై వరుస ప్రమాదాలు

CTR: పలమనేరు మున్సిపాలిటీ నాగమంగళం వద్ద నుంచి మొగిలి ఘాట్ వరకూ బైపాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వారం క్రితం గంగవరం బైపాస్‌లో లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అది మరవక ముందే ఆదివారం రోజు కుక్క అడ్డు రావడంతో ఓ కారు బోల్తా కొట్టింది.