VIDEO: 'ఆంటీబయాటిక్స్ అతిగా వాడటం మంచిది కాదు'

VIDEO: 'ఆంటీబయాటిక్స్ అతిగా వాడటం మంచిది కాదు'

ADB: ఆంటీబయాటిక్స్ అతిగా వాడటం మంచిది కాదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆంటీబయాటిక్స్ మందుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. వైద్యుల సూచన మేరకు మందులను వాడాలన్నారు. రోజువారీ జీవన శైలిలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, ఆశ కార్యకర్తలు తదితరులున్నారు.