కారు కొనివ్వలేదని సూసైడ్..!

సిద్దిపేట: చేర్యాలలో సోమవారం విషాదం నెలకొంది. కారు కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న నవీన్ ఇటీవల కారు కొనివ్వాలంటూ తండ్రితో గొడవపడ్డాడు. డబ్బులు జమ చేసి ఫైనాన్స్ కొందామని తండ్రి నర్సింహులు సర్ది చెప్పినప్పటికీ వినిపించుకోనట్లు తెలుస్తోంది. పని మానేసిన అతడు మనస్తాపంతో అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొన్నట్లు స్థానికులు తెలిపారు.