ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి తహసిల్ ప్రాంతంలో ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలతో సహా 9 మంది సభ్యులు మృత్యువాతపడ్డారు. వీరంతా 10 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి షార్ట్ కట్ మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 9 మంది మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.