ఈ నెల 9న గొల్లపల్లి- చీర్కపల్లికి హరీష్ రావు రాక..!
WNP: రేవల్లి మండలంలోని గొల్లపల్లి- చిర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి దీక్షలకు సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారని చెప్పారు. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్మాణం చేపడుతుందని మండిపడ్డారు.