'విగ్రహాలు కాదు.. విద్యకు నిధులివ్వండి'
BHNG: విద్యార్థులకు కావాల్సింది విగ్రహాలు కాదని, వారికి ఇవ్వాల్సిన రూ. 9 వేల కోట్ల సాలర్‌షిప్ ఫీజు బకాయిలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పీ. మోదీ రాందేవ్ పేర్కొన్నారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం భువనగిరిలో విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.