'వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి'

'వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి'

WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామం నుండి పర్వతగిరి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు గుంతలు కనబడక.. ప్రమాదాలకు గురవుతున్నారని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమత్తు పనులు చేపట్టాలని ఇవాళ డిమాండ్ చేశారు.