వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన దర్శి వాసి

వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన దర్శి వాసి

ప్రకాశం: దర్శి పట్టణానికి చెందిన వేల్పుల విజయకుమార్ సత్తా చాటారు. పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ 2025 పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు అమెరికాలో జరగబోయే వరల్డ్ కప్ పోటీల్లో విజయకుమార్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పారా ఒలింపిక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారిక లేఖ అందినట్లు విజయకుమార్ తెలిపారు.