ఎమ్మెల్యే రేవూరి ఆత్మకూరు పర్యటన రద్దు
HNK: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదివారం కార్యక్రమాలు రద్దు అయినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అత్యవసర సమావేశాలు ఉన్నందున ఇవాళ ఆత్మకూరు మండలంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రద్దు అయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండలాధికారులు, ప్రజలు విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.