GHMC సిబ్బందికి వైద్య పరీక్షలు
SRD: రామచంద్రపురం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో GHMC సిబ్బందికి సోమవారం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన మందులు, మాత్రలు ఇచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టే కార్మికులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు మందులు మాత్రలు వాడాలని తెలిపారు.