కందులకు మద్దతు ‘భరోసా’.. క్వింటాకు రూ. 8,000
సూర్యాపేట జిల్లాలోని కందుల రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిబంధనల ప్రకారం నాణ్యత (FAQ) కలిగిన కందులకు క్వింటాకు రూ. 8,000/- మద్దతు ధర చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్ కే. సీతారామరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మార్కెటింగ్, అగ్రికల్చర్, సహకార శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.