నిరుపయోగంగా తాడికొండ పోలీస్ ఔట్ పోస్ట్
GNTR: తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ అవుట్ పోస్ట్ నిరుపయోగంగా పడి ఉంటుందని మండల వాసులు అంటున్నారు. గతంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పోలీస్ పోస్ట్ నేడు అక్కడ ఒక్క కానిస్టేబుల్ కూడా లేకపోవడంతో నిత్యం వెలవెలబోతుందని, రాజధాని ప్రాంతానికి వచ్చే సమయంలో మొదటి చెక్ పోస్ట్‌గా ఈ అవుట్ పోస్ట్ ఉంటుందంటున్నారు.