భర్త జ్ఞాపకాల భారం.. మహిళ బలవన్మరణం

భర్త జ్ఞాపకాల భారం.. మహిళ బలవన్మరణం

కృష్ణా: భర్తను కోల్పోయిన జ్ఞాపకాల భారం చివరకు ప్రాణాంతకంగా మారిన విషాద ఘటనగా పోరంకి నారాయణపురం కాలనీలో వెలుగుచూసింది. ఐదేళ్ల క్రితం జాస్తి శ్రీదేవి భర్త మృతి తర్వాత ఆమె తీవ్ర మనోవేదనతో జీవించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. మంగళవారం ఇంట్లోనుంచి రాకపోవడంతో వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.