శ్రీ నారాయణ స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

శ్రీ నారాయణ స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మెట్టపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామి వారి ఆదాయం రూ. 17,47,923 వచ్చినట్లు ఆలయ ఈవో నరసింహ బాబు తెలిపారు. అదేవిధంగా 94 గ్రాముల బంగారం, 6.233 కేజీల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి పానకాలరావు పాల్గొన్నారు.