ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
AKP: రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఇవాళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామంలోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.