గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న హర్షిత్ రాణా
టీమిండియా ప్లేయర్ హర్షిత్ రాణా మెల్‌బోర్న్ టీ20లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టాడు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కష్టసమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాణా.. అభిషేక్ శర్మతో కలిసి కీలకమైన 56 పరుగుల భాగస్వామ్యం అందించాడు.