విస్తరణకు నోచుకోని రహదారులు!

విస్తరణకు నోచుకోని రహదారులు!

JGL: కోరుట్ల పట్టణంలోని ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణంలోని అయిలాపూర్ రోడ్డు, గాంధీ రోడ్డు, కల్లూర్ రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారి విస్తరణకు తీర్మానం చేసి 25 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పనులకు మోక్షం కలగడం లేదు.