దక్షిణాఫ్రికాకు ట్రంప్ షాక్

దక్షిణాఫ్రికాకు ట్రంప్ షాక్

దక్షిణాఫ్రికాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. వచ్చే జీ20 సదస్సులో దక్షిణాఫ్రికాను పాల్గొనివ్వనని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆ దేశానికి ఇచ్చే చెల్లింపులు, రాయితీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన సదస్సు ముగింపు వేడుకలో జీ 20 ప్రెసిడెన్సీని అమెరికా రాయబార ప్రతినిధినికి ఇచ్చేందుకు దక్షిణాఫ్రికా నిరాకరించిందంటూ ట్రంప్ మండిపడ్డారు.