కలెక్టర్‌ను కలిసిన నూతన జడ్పీ సీఈవో
కృష్ణా: జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న జే. అరుణను ప్రభుత్వం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈవో) పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో నూతన సీఈవో కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి సీఈవో కన్నమ నాయుడు కూడా ఉన్నారు.