చదువుతోనే విద్యార్థులకు ఉత్తమ గుర్తింపు: ఎమ్మెల్యే

WNP: పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సన్మానించి అభినందించారు. ఉన్నతమైన చదువులతోనే విద్యార్థులకు ఉత్తమ గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉంటూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పెబ్బేరు మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు సంబంధించి పదవ తరగతి పరీక్షలలో ఉన్నతమైన మార్కులు సాధించిన వారిని సన్మానించారు.