'అఖండ-2'కు హైకోర్టులో భారీ ఊరట
'అఖండ-2' చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో భారీ ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు జీవోను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించిందని డివిజన్ బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.