యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీశారు. యూనిట్-1 లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన మూడు బాయిలర్లు రన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.