VIDEO: రామాలయంలో హోమాలు జలాభిషేకాలు
ఏలూరు: ఉంగుటూరు తూర్పు కాపుల రామాలయం కట్టి సుమారు 65 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆలయం ఆధునీకరణ నిమిత్తం రంగులు వేయించి, గురువారం హోమం నిర్వహించారు. తొలుత సీతారాములకు భక్తులు జలాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో శుక్రవారం రామాలయంలో సీతారామ కళ్యాణం ఏర్పాటులకు అన్ని పూర్తి చేశారు.