VIDEO: జంగారెడ్డిగూడెంలో విస్తృతంగా వాహన తనిఖీలు
ELR: జంగారెడ్డిగూడెం పట్టణ శివారులో ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్సులు, బండి పేపర్లు, హెల్మెట్లు, పెండింగ్ చలానాలు ఉన్న వారి చేత చలానాలు కట్టించారు. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.