మిర్యాలగూడలో బీసీ నేతల మౌన దీక్ష

మిర్యాలగూడలో బీసీ నేతల మౌన దీక్ష

NLG: మిర్యాలగూడ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు గురువారం మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ బీసీ జేఏసీ కన్వీనర్ గుండెబోయిన నాగేశ్వర రావు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు, దుర్గయ్య, జాడిరాజు, ఎస్పీ నాయుడు, మురళి పాల్గొన్నారు.