YVUని అగ్రగామిగా నిలపాలి: ఓబులేష్
KDP: యోగివేమన యూనివర్సిటీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేష్ యాదవ్ తెలిపారు. నూతన ఉపకులపతిగా నియమితులైన బెల్లంకొండ రాజశేఖర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైవీయూ అభివృద్ధి కోసం ఆర్ఎస్ఎఫ్ ముద్రించిన కరపత్రాలను వీసీకి అందజేశారు. కాగా, నిర్మాణ దశలో ఆగిపోయిన పరిపాలనా భవనం, మేనేజ్మెంట్ బ్లాక్ చుట్టూ ప్రహరీ గోడలను పూర్తి చేయాలన్నారు.