స్వల్పంగా తగ్గిన పత్తి ధర..!

స్వల్పంగా తగ్గిన పత్తి ధర..!

KNR: జమ్మికుంట వ్యవనాయి మార్కెట్‌కు బుధవారం రైతులు 7 వాహనాల్లో 70 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. పత్తి ధర తాజాగా మంగళవారం కంటే బుధవారం రూ.50 తగ్గింది. మార్కెట్‌లో క్రయ విక్రయాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి రాజా వ్యాపారులు పరిశీలించారు.