బాపులపాడులో సంతకాలు చేసిన వంశీ

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌కు శనివారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ హాజరయ్యారు. కోర్టు షరతుల మేరకు రిజిస్టర్‌లో ఆయన సంతకాలు చేశారు. అక్కడికి తరలి వచ్చిన తన అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం పలువురితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం వంశీ రాజకీయాల విషయాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు.