VIDEO: ఎస్సైలు కాంగ్రెస్ అధ్యక్షులా?.. జగదీష్ రెడ్డి ఫైర్
SRPT: పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. చింతలపాలెం, మఠంపల్లి, గరిడపల్లి, హుజూర్ నగర్ ఎస్సైలు కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. పోలీసులు విధులను సక్రమంగా చేయాలని గరిడేపల్లిలో ఆయన మాట్లాడారు.