'కలలు కనండి.. సాధించిండి'

'కలలు కనండి.. సాధించిండి'

GNTR: 'కలలు కనండి.. వాటిని సాధించిండి' అంటూ కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా విద్యార్థులకు హితబోధ చేశారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా నగరంలోని గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో 'జాతీయ గౌరవ దివాస్' ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మమేకమై వారికి స్ఫూర్తిదాయక సూచనలు, సలహాలు అందించి, చదువు విలువను తెలిపారు. అలాగే, బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.