ITC పుణ్యమాని.. సారపాకలో తాగునీటి కొరత.?
BDK: సారపాక పంచాయతీ పరిధిలోని కర్ర యార్డ్ వద్ద ఎన్‌హెచ్-30 ఫుట్‌పాత్‌పై ఐటీసీ కాంట్రాక్టు వాటర్ ట్యాంకర్ల నిలిపివేతతో ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఫుట్‌పాత్ కింద ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్లు ఈ వాహనాల బరువుకు తరచూ పగిలిపోతున్నాయి. దీంతో వేలాది మందికి నీటి సరఫరా నిలిచిపోవడమే కాకుండా, మరమ్మతుల కోసం పంచాయతీ నిధులు వృథా అవుతున్నాయి.