ఘనంగా మహా శివలింగార్చన కార్యక్రమం
NLR: వరికుంటపాడు మండలం టోటలచెరువుపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస ఏకాదశి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం సహస్ర దీపాలంకరణ, 1,116 దీపాలతో మహా శివలింగార్చన కార్యక్రమం, గ్రామ పురోహితులు లోక వెంకటప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.