ఇక్కడ నంది విగ్రహం ఏటా పెరుగుతుంది..!
నిర్మల్: దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపాహరేశ్వర ఆలయం పురాణ ప్రాశస్త్యం పొందింది. మాతృహత్య దోష నివారణకు పరశురాముడు ఇక్కడ లింగాలను ప్రతిష్ఠించగా, అవి కదిలినందున ‘కదిలే’ అనే పేరు వచ్చినట్లు పురాణ గాథ. ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రంలోని నంది విగ్రహం ఏటా పెరుగుతుండటం విశేషం.