కుట్టు మిషన్ల శిక్షణను తనిఖీ చేసిన ఈడి

BPT: మకొరిశపాడు మండలం మెదరమెట్లలోని గ్రామ సచివాలయం నందు జరుగుతున్న కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. కుట్టు మిషన్ శిక్షణకు ఎంతమంది హాజరవుతున్నారు అనే దాని గురించి ఆయన నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. హాజరుకాని వారి ప్లేస్‌లో కొత్తవారిని తీసుకోవాలని ఆయన సూచించారు.