ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకుపోయిన కాలువలు

ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకుపోయిన కాలువలు

NZB: నిజామాబాద్‌ నగరపాలక పరిధిలో ప్రధాన మురుగు కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో తీవ్రంగా మూసుకుపోయాయి. వాణిజ్య ప్రాంతాల్లో ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను చెత్తబండ్లకు ఇవ్వకుండా అడ్డగోలుగా కాలువల్లో పడేస్తుండటంతో ప్రవాహం పూర్తిగా నిలిచిపోయే స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో కాలువలను తక్షణం యంత్రాలతో శుభ్రం చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.