'అంగన్‌వాడీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
ASR: అంగన్‌వాడీల అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. కార్యకర్తల వేతనానికి రూ.1000 ప్రోత్సాహకం కలిపి రూ.11,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సహాయకుల వేతనాల పెంపు, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.