ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
SRCL: ఇందిరమ్మ ఇంట్లోకి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు రామతీర్థపు శ్రీనివాస్- పద్మ దంపతులు తెలిపారు. వేములవాడ పట్టణంలోని 9వ వార్డులో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో ఇంటి లబ్ధిదారులు ఆప్యాయంగా మాట్లాడారు.