సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎస్సై సురేష్
ATP: గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ హెచ్ఎం సుంకన్న ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుత్తి ఎస్సై సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థులలో సృజనాత్మక నైపుణ్యాలను ప్రోత్సహిస్తే వారు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తారన్నారు.