రేపు బీజేపీ కార్యకర్తల సమావేశానికి మెదక్ ఎంపీ రాక

SRD: జిన్నారం మున్సిపల్ బీజూపీ కార్యకర్తల సమావేశాన్ని రేపు స్థానిక ఎన్ఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ పార్టీ అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమావేశానికి సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జిన్నారం నాయకులను జగన్ రెడ్డి కోరారు.